Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌పై కూడా...
వాషింగ్టన్ : మానవ హక్కుల పేరుతో చైనా, ఉత్తర కొరియాపై పలు ఆంక్షలు విధించిన అమెరికా, చివరికి బంగ్లాదేశ్‌ను కూడా వదిలిపెట్టలేదు. తన ప్రపంచాధిపత్యానికి అడ్డుతగిలిన, తన మాట వినని దేశాలపై ప్రజాస్వామ్యం, మానవ హక్కులను సాధనాలుగా చేసుకుని వాటిని ఇబ్బంది పెట్టడం అమెరికా మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం. ఈ దేశాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు, సంస్థలపై అమెరికా శుక్రవారం పలు ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన కృత్రిమ మేథో సంస్థ 'సెన్స్ టైమ్ గ్రూప్'ను అది బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ముఖాన్ని గుర్తించే ప్రోగ్రామ్‌లను అభివృద్ధిపరిచారంటూ, దీనిని ఆంక్షలు వర్తించే ఇతర చైనీస్ కంపెనీల జాబితాలో చేర్చుతున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ 50వ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడానికి కొద్ది రోజుల ముందు అమెరికా ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
తమ ప్రభుత్వ అధీనంలోని ముఖ్యమైన రాపిడ్యాక్షన్ బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం ఏకపక్షం, దురుద్దేశంతో కూడిన చర్య అని బంగ్లాదేశ్ విమర్శించింది. మానవ హక్కులను సాకుగా చేసుకుని అమెరికా ఈ విధంగా ఏకపక్షంగా, ముందుగా ఎలాంటి సమాచారమివ్వకుండా ఆంక్షలు విధించడం విచారకరమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.