Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా వ్యాఖ్య
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెరికాకు అప్పగించేందుకు లండన్ అప్పిలేట్ కోర్టు అనుమతిస్తూ తీర్పు ఇవ్వడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. మానవ హక్కుల దినోత్సవం రోజునే ఇటువంటి తీర్పు వెలువడడం సిగ్గుచేటని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జకరోవా విమర్శించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల్లో అమెరికా బలగాలు సాగించిన నేరాలను తీవ్రంగా నిరసిస్తూ వెలికితీసినందుకు ఆస్ట్రేలియా జర్నలిస్టు అసాంజెను గత 12 ఏళ్లుగా అమెరికా వేధిస్తోంది. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు పోరాడుతున్న అసాంజెపై అమెరికా మోపిన అభియోగాలు రుజువైతే అమెరికాలో 175 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం వుంది. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థ ముసుగులో జరిగే హత్య అని ఫ్రెంచి సోషలిస్టు నేత జేన్ లక్ మెలెంకన్ వ్యాఖ్యానించారు.