Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శనివారం నాలుగు టోర్నడోల ఉగ్రరూపానికి 50 మందికిపైగా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. అతి బలమైన టోర్నడో ఒకటి రాష్ట్రంలో 200 మైళ్లకు పైగా దూరం వరకూ తన ఉగ్రరూపం ప్రదర్శించిందని కెంటకీ గవర్నర్ అండీ బెషీర్ వెల్లడించారు. టొర్నడో విజృంభణతో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎడ్వర్డ్స్విల్లే పట్టణలోని ఒక భారీ అమెజాన్ గోడౌన్ ధ్వంసమైయింది. ఈ ఇందులో సుమారు 100 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. వీరిని రక్షించేంచేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలో ఇల్లినాయిస్ ప్రభుత్వ పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ జెబీ ప్రిట్జర్ చెప్పారు. పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు జేబీ ప్రిట్జర్ తెలిపారు.