Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో అతిపెద్ద విపత్తుల్లో టోర్నడో ఒకటి : జో బైడెన్
వాషింగ్టన్ : దేశ చరిత్రలో అతి పెద్ద విపత్తుల్లో టోర్నడో ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టోర్నడో ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆయా ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని బైడెన్ వెల్లడించారు. గత రెండు రోజులుగా ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్నెసీలోని వివిధ ప్రాంతా ల్లోనూ టోర్నడోలు బీభత్సం సష్టించి ఆస్తి, ప్రాణ నష్టం కలిగించాయి. ప్రాణనష్టంపై సరైన సమాచారం లేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో భారీ సంఖ్యలో మరణాలు నమోదై ఉంటాయని భావిస్తున్నాయి. అమెరికా చరిత్రలో 1925 తర్వాత అత్యంత తీవ్రమైన టోర్నడో ఇదేనని అధికారులు ప్రకటించారు. కెంటకీపై టోర్నడో విరుచుకుపడినట్ల్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మేఫీల్డ్ పట్టణం నేలమట్టమైందని, అక్కడి చారిత్రక భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయని తెలిపాయి.