Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా: ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు వెలుగుచూసిన ఆందోళనకర కరోనా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరమైనదనే అంచనాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా పలు హెచ్చరికలు చేసింది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా.. ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభణకు కారణమైంది.
భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ కారణమైంది. అయితే, దీనికంటే ప్రమాదకరమైనదిగా భావిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌ను గత నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. దీని ప్రాథమిక డేటాను విశ్లేషణ ఆధారంగా దీనిలో అధిక మ్యూటేషన్లకు కారణమయ్యే స్పైక్ ప్రొటీన్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. దీని అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్య నిపుణులు, పలువురు పరిశోధకులు పేర్కొన్నారు.
డిసెంబర్ 9 నాటికే ఒమిక్రాన్ వేరియంట్ 63కు పైగా దేశాలకు విస్తరించిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. డెల్టా వేరియంట్ ప్రభావం తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాతో పాటు డెల్టా వేరియంట్ ప్రభావం అధికంగా ఉన్న బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని తెలిపింది. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రభావం, టీకాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే తీరుపై ఇంకా పూర్తి డేటా రావాల్సి ఉందని తెలిపింది. ''ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను బట్టి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ అధిగమించే అవకాశం ఉంది'' అని హెచ్చరించింది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంది కానీ తీవ్రమైన ప్రభావం చూపడం లేని కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. టీకాలు సామర్థ్యాన్ని సైతం తగ్గిస్తున్నదని తెలిపింది. దీనికి సంబంధించి క్లినికల్ చర్యలు తీసుకోవడానికి మరింత డేటా కావాలని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. అధిక మందికి కరోనా టీకాలు వేయడం ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేసిం భారత్ ఒమిక్రాన్ కేసులు 38కి పైగా నమోదయ్యాయి.