Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునామీ ప్రమాదం లేదన్న ప్రభుత్వం
జకర్త (ఇండోనేషియా) : ఇండోనేషియాలో మంగళవారం తెల్లవారు జామున 7.3 పాయింట్ల తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపంతో ముందుగా సునామీ ప్రమాద హెచ్చరికలు జారీ అయినా, తరువాత సునామీ ముప్పు లేదని ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు. తూర్పు నుసా తెంగ్గరా రాష్ట్రానికి ఉత్తరంలో ఫ్లోరెస్ సముద్రంలో సుమారు 47 మైళ్లు (76 కిలోమీటర్లు) లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జీయోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. ఈ భూకంపంతో మంగ్గరైలో ఒకరు గాయపడగా, సెలయర్ ద్వీపంలో ఒక పాఠశాల భవనం దెబ్బతిన్నదని ఇండోనేషియా జాతీయ విపత్తు సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే భూకంప ప్రభావాన్ని ఇంకా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.