Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆఫ్ఘన్లో 20ఏళ్ళ యుద్ధం వైఫల్యాలను సమీక్షించేందుకు అమెరికా, కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం అమెరికన్ కాంగ్రెస్ ఓటు వేసింది. అమెరికన్ సెనెట్ 89-10 ఓట్ల తేడాతో ఆమోదించిన 76,800 కోట్ల డాలర్ల వార్షిక రక్షణ ప్యాకేజీలో భాగంగా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గతవారం ప్రతినిధుల సభ ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. ఈ కమిషన్‌లో 16మంది సభ్యులు వుంటారు. వీరిని రెండు రాజకీయ పార్టీలు నామినేట్ చేస్తాయి. కమిషన్ మొదటి సమావేశం జరిగిన ఏడాదిలోగా తొలి నివేదిక అందచేయాల్సి వుంటుంది. మూడేళ్ళలోగా తుది నివేదిక ఇవ్వాల్సి వుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా యుద్ధాన్ని ఈ కమిషన్ సమగ్రంగా సమీక్షిస్తుంది. దీన్నుండి నేర్చుకున్న గుణపాఠాలను పేర్కొంటూ కొన్ని సిఫార్సులు చేస్తుందని జాతీయ రక్షణ అధికార బిల్లు పేర్కొంటోంది. ఈ బిల్లుపై అధ్యక్షుడు బైడెన్ త్వరలో సంతకం చేయనున్నారు. 2001నాటికి ముందు ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా విధానం, అలాగే జార్జి బుష్ యుద్ధాన్ని ప్రారంభించడంపై కూడా కమిషన్ సమీక్ష జరుపుతుంది.