Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్: ఎలాంటి సైనికపరమైన ఉద్రిక్తతలు చెలరేగడానికి ముందుగానే రష్యాపై ముందస్తు ఆంక్షలు విధించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఇయుకి విజ్ఞప్తి చేశారు. దాడి జరిగిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరించడం వల్ల జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పు దేశాల భాగస్వామ్య సదస్సు జరిగిన అనంతరం బ్రస్సెల్స్లో బుధవారం జెలెన్స్కీ మాట్లాడారు. సైనికపరంగా రష్యా చర్యలు తీసుకోకుండా వుండేలా చూడాలని సూచించారు. అవసరమనుకుంటే రష్యాతో ప్రత్యక్షంగా చర్యలు జరపడానికి కూడా ఉక్రెయిన్ సిద్ధంగా వుందన్నారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా వున్న నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటన వెలువడింది. రష్యా బలగాలు కదలికలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఘర్షణ తలెత్తే అవకాశం వుందని పశ్చిమ దేశాల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా తమకు దాడి చేసే ఉద్దేశ్యమే లేదని రష్యా పదే పదే చెబుతోంది. దౌత్యపరిష్కారాన్ని అన్వేషించాలని కోరుతోంది. ఏదన్నా జరిగిన తర్వాత ఆంక్షలు విధించడం కన్నా ముందస్తుగానే ఆంక్షలు విధిస్తేనే ప్రయోజనం వుంటుందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తమ దేశం ఆగేయ ప్రాంతంలో గత కొన్నేళ్ళుగా .జరుగుతున్న ఘర్షణలను అంతమొందించడమే తమ ఉద్దేశ్యమని, అందుకోసం ఏ తరహాలోనైనా రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు.