Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిన్‌పింగ్‌కు ఫోన్‌కాల్
- బీజింగ్ ఒలింపిక్స్‌కు హాజరవుతానని వెల్లడి
మాస్కో, బీజింగ్: చైనా, రష్యా మధ్య నెలకొన్న సంబంధాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. బుధవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడుతూ, బీజింగ్ ఒలింపిక్స్‌కు హాజరవుతానని చెప్పారు. జిన్‌పింగ్‌తో ఫోన్ సంభాషణ అనంతరం పుతిన్ జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగిస్తూ, ఫిబ్రవరిలో బీజింగ్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు ప్రకటించారు. జిన్‌పింగ్ తన ప్రియతమ స్నేహితుడని వ్యాఖ్యానించారు. చైనా-రష్యా సంబంధాలు అన్ని రకాల కఠిన పరీక్షలకు ఎదురొడ్డి నిలిచాయని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వ్యాఖ్యానించింది. నూతనోత్తేజం, చైతన్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. ఉయిగర్స్ ముస్లింల విషయంలో చైనా వ్యవహార శైలిని విమర్శిస్తూ ఒలింపిక్స్‌కు తమ ప్రతినిధులను పంపరాదని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా నిర్ణయించాయి. కాగా ఈ దౌత్య బహిష్కరణను చైనా, రష్యా తీవ్రంగా నిరసిస్తున్నాయి. క్రీడలను, ఒలింపిక్ ఉద్యమాన్ని రాజకీయం చేసే ఏ ప్రయత్నాన్నైనా తామిరువురం వ్యతిరేకిస్తామని పుతిన్ చెప్పారు. ఇటీవలి కాలంలో పశ్చిమ దేశాలతో చైనా, రష్యా సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో మరింత ఐక్యంగా ముందుకు సాగాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ''మన రెండు దేశాల మధ్య కొత్త తరహా సహకారం ఏర్పడిందని'' బుధవారం జిన్‌పింగ్‌తో పుతిన్ వ్యాఖ్యానించారు.