Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానసిక వ్యాధుల వైద్యశాలలో అగ్నిప్రమాదం
ఒసాకా: జపాన్లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించటంతో.. 27 మంది మరణించారు. వీరిలో 10 మంది మహిళలు ఉన్నారు. మృతుల వివరాలను జపాన్ ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. నివేదికల ప్రకారం, చాలా మంది ప్రజలు ఊపిరాడక చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మానసిక వ్యాధుల వైద్యశాలకు చికిత్స కోసం వచ్చినవారే ఉన్నారనీ, అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
అగ్ని వేగంగా విస్తరించటంతో... 'జపాన్ టైమ్స్' కథనం ప్రకారం, ఒసాకాలోని కమర్షియల్ బ్లాక్లో బహుళ అంతస్తుల భవనంలోని నాలుగో అంతస్తులో మానసిక ఆరోగ్య వైద్యశాల ఉన్నది. వైద్యశాలకు తరచుగా పేషంట్లు ఇక్కడ ఉంటారు. శుక్రవారం ఉదయం కూడా ఎప్పటిలాగాదే..చాలా మంది రోగులు క్లినిక్కు వచ్చారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సర్వీస్ అలర్ట్తో 20కి పైగా అగ్నిమాపక శకటాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినా 27 మందిని రక్షించలేకపోయారు. చాలా మంది ఊపిరాడక మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాగా మంటలు చెలరేగడంతో ఐదు, ఆరో అంతస్తుల్లోని వ్యక్తులను రక్షించారు.మంటలు చెలరేగడంతో..తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు చెలరేగిన భవనంలో భాగం చాలా ఇరుకుగా ఉండటంతో... ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు . దీంతో వారు శ్వాస తీసుకోలేక..బయటకు వెళ్లలేక చనిపోయారని ప్రాధమిక అంచనా కొచ్చారు. 2019లో క్యోటోలోని ఫిల్మ్ స్టూడియోకి ఓ వ్యక్తి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో 36 మంది చనిపోయారు. అంతకు ముందు 2001లో కబుకిచో నగరంలోని ఓ రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయిన విషయం విదితమే.