Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిటీ ట్రాన్స్మిషన్తో మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు
- ప్రస్తుతం 89 దేశాల్లో కేసులు : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న ప్రాంతాల్లో ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల నుంచి ఒమిక్రాన్ కేసులు నివేదించబడ్డాయని వివరించింది. ప్రజల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదనీ, అయితే ఈ విషయంలో మాత్రం స్పష్టత లేదని తెలిపింది. '' ఒమిక్రాన్ క్లినికల్ తీవ్రతపై సమాచారం పరిమితంగానే ఉన్నది. తీవ్రత ప్రొఫైల్ను, వ్యాక్సినేషన్, ముందుగా ఉన్న రోగనిరోధక శక్తి ద్వారా అది ఎలా ప్రభావితమవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం అవసరం'' అని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. టీకా సమర్థత లేదా ప్రభావంపై ఇప్పటివరకూ పరిమిత సమాచారం మాత్రమే ఉన్నదని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.