Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద మందికిపైగా మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌లో 'రారు' తుపాన్్ దాటికి 108మంది మర ణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరణాల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులే చెబుతున్నారు. ఈ సంవత్సరం ఫిలి ప్ఫీన్స్ను తాకిన బలమైన తుపాను 'రారు'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ఆదివారం అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాం తాలపై ఈ తుపాను విరుచుకుపడటంతో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. గ్రామాలన్నీ నీట మునిగాయి. మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లను, రిసార్ట్‌ల ను ఖాళీ చేశారు. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో కూడిన సూపర్ తుపాన్ 'రారు' గురువారం ద్వీపంపై విరుచుకుపడింది. పలువురు గల్లంతు కాగా, చాలామంది గాయాల పాలయ్యారు. ఆర్మీ, పోలీసు, కోస్ట్‌గార్డ్, అగ్ని మాపక సిబ్బంది వేలాదిమంది తుపాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటక కేంద్రమైన బోహోల్‌లో 72 మంది మరణించారని అక్కడి గవర్నర్ ఆర్థర్ యాప్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. దీనాగట్ దీవుల్లో పది మంది మరణించారని ప్రాంతీయ సమాచార అధికారి జెఫ్రీ క్రిసోస్టోమా తెలిపారు. ఫిలిప్సిన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే శనివారం పలు ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫిలిప్పైన్స్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు, పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు 21.6 మిలియన్ డాలర్లు అవసరమని రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల ప్రధాన బాధ్యులు ఆల్బెర్టో బొకనెగ్రా పేర్కొన్నారు.