Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాంకాంగ్ సిటీ : ఆదివారం జరిగిన హాంకాంగ్ చట్టసభ ఎన్నికల్లో బీజింగ్ అనుకూల అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. నగరంలో జరిగిన మొదటి పబ్లిక్ పోల్లో మోడరేట్లు, స్వతంత్ర అభ్యర్ధులపై వీరు మెజారిటీ సీట్లలో గెలుపొందారు. నగర ఎన్నికల చట్టాలను సవరిస్తూ చైనా ఒక తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం బీజింగ్ అనుకూల దేశభక్తులు మాత్రమే నగరాన్ని పాలించేలా చట్టాల్లో సవరణలు తీసుకువచ్చారు. హాంకాంగ్ నేత కేరీ లామ్ సోమవారం ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కేవలం 30.2 శాతం ఓట్లు మాత్రమే పోలయినా తాను సంతృప్తి చెందానని చెప్పారు. అంటే 10.35లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1997లో బ్రిటన్, హాంకాంగ్ నగరాన్ని చైనాకు అప్పగించిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో ఎన్నడూ ఓట్లు పోలవలేదు. అయితే ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు 92.5శాతం వున్నారని ఆమె తెలిపారు. 2016లో ఈ సంఖ్య 70శాతంగా మాత్రమే వుంది. అయితే ఓటు హక్కును వినియోగించుకోవాలా లేదా అనేది వారి ఇష్టమని ఆమె వ్యాఖ్యానించారు.