Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : యూరప్ మొత్తంగా తీవ్ర స్థాయిలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చరిత్రలో మొదటిసారిగా మంగళవారంనాడు వెయ్యి క్యూబిక్‌మీటర్ల గ్యాస్ ధర 2,150 డాలర్లు దాటిందని ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లండన్ క్లియరింగ్ హౌస్ తెలిపింది. యూరప్ గ్యాస్ ధరలకు ప్రామాణికమైన నెదర్లాండ్స్‌లోని డచ్ టీటీఎఫ్ హబ్‌లో గ్యాస్ ధర ఒకరోజులోనే 27శాతం పెరిగింది. గృహావసరాల విషయంలో చూసినట్లైతే మెగావాట్ అవర్‌కు గ్యాస్ ధర దాదాపు 210 డాలర్లుకు చేరుకుంది. బుధవారం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత ఈ పెరుగుదల కొద్దిగా క్షీణించింది. రష్యా నుండి యూరప్ గ్యాస్ పైప్‌లైన్ ద్వారా జర్మనీకి గ్యాస్ సరఫరాలు రావడం నిలిచిపోవడంతో ఈ ధరలు పెరిగాయని, ఆ సరఫరాలను పోలెండ్‌కు మళ్ళించారని రష్యన్ గ్యాస్ ట్రాన్స్మిషన్ ఆపరేటర్ గాస్కేడ్ డేటా పేర్కొంటోంది.