Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్‌లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెల్టా వైరస్ తగ్గుముఖం పట్టకుండానే.. ఒమిక్రాన్ దేశంపై విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,06,122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులే 13 వేలకు పైగా ఉండటం ఆందోళనకరం. మొత్తంగా 69 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒమిక్రాన్ కేసుల విషయంలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కేసులు బ్రిటన్‌లోనే వెలుగుచూశాయి.
కరోనా కేసుల ఉధృత నేపథ్యంలో బ్రిటన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు టీకాలు పంపిణీ చేసేందుకు అంగీకరించింది. 5 నుండి 12 ఏళ్లలోపు చిన్నారులకు టీకా అందించాలని నిర్ణయించింది. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివద్ధి చేసిన ఫైజర్ టీకాను తక్కువ మోతాదులో పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది. 5-11 ఏళ్ల వారికి ఎనిమిది వారాల వ్యవధితో రెండు డోసులు ఇవ్వనున్నారు. ఇక దీంతో పాటు 16, 17ఏళ్ల వారికి బూస్టర్ డోసులను ఇచ్చే అంశంపైనా యూకే ప్రభుత్వం దష్టిపెట్టింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ 18ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోసులతో పాటు బూస్టర్ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక 12-17ఏళ్ల వారికి రెండు డోసులు టీకాలను అందిస్తున్నారు.