Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడ్డుకు చేరుకున్న మడగాస్కర్ మంత్రి
అంటాననారివో: మడగాస్కర్ పోలీస్ శాఖ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లే ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడంతో హిందూ మహాసముద్రంలో పడిపోయింది. ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. 12 గంటల పాటు ఈతకొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆయన్ను ఓ మత్య్సకారుడు గుర్తించి.. తన పడవలో ఒడ్డుకు చేర్చినట్లు అధికారులు చెబుతున్నారు. హెలికాఫ్టర్లో ఉన్న మరో అధికారి జిమ్మి లిట్సారా... కూడా ఓ ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని తెలుస్తోంది.