Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : సంపన్న దేశాలు అదనపు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పట్ల హడావుడి చేయడం ద్వారా టీకాల వినియోగంలో అసమానతలు మరింత దిగజారి, మహమ్మారి సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రాయసిస్ హెచ్చరించారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారికి అదనపు డోసులు ఇవ్వడం కన్నా.. ప్రమాదం అధికంగా ఉండే వ్యక్తులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత చూపించాలని అన్నారు. మహమ్మారి నుంచి బయట పడేందుకు ఏ ఒక్క దేశం ప్రయత్నించలేదని విమర్శించారు. చాలా కాలంగా వ్యాక్సిన్ల విషయంలో నెలకొన్న అసమాన తలను టెడ్రోస్ ఖండిస్తూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి చేసేందుకు అనుమతించడం వల్ల కొత్త, మరింత ప్రమాదకరమైన వైరస్లు సృష్టించేందుకు కారకులౌతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. బూస్టర్ డోసుల నిమిత్తం అధిక స్థాయిలో టీకాలు అందించిన దేశాలకు వ్యాక్సిన్లను మళ్లించడం ద్వారా మహమ్మారిని అంతం చేయడానికి బదులు.. పొడిగించ డానికి అవకాశం ఇచ్చినట్లయిందని టెడ్రోస్ అన్నారు. దీని వల్ల వైరస్ వ్యాప్తికి, కొత్త వేరియంట్ సృష్టికి కారకులౌతున్నామని హెచ్చరించారు.