Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో సోషలిస్ట్ దేశమైన క్యూబాలో బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. వచ్చే వారాల్లో ఆరు మిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసేందుకు క్యూబా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రభుత్వ బయోటెక్ కంపెనీ బయోక్యూబా ఫార్మా అధ్యక్షుడు ఎడ్వర్డో మార్టినెజ్ పేర్కొన్నట్లు అక్కడి దిన పత్రిక గ్రాన్మా తెలిపింది. 2022 జనవరి చివరినాటికి 11.2 మిలియన్ దేశ జనాభా మొత్తానికి అందించేందుకు అవసరమైన వ్యాక్సిన్ బూస్టర్డోస్లను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఆ దేశ జనాభాలో 99శాతం మందికి పైగా ఒక్క డోసు వ్యాక్సిన్‌ను తీసుకోగా, 84శాతం మంది రెండుడోసుల వ్యాక్సిన్లు తీసుకు న్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశీయ ఔషద సంస్థలు రూపొందించిన అబ్డాలా, సొబెరానా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. కరోనా ప్రారంభైన ఏడాది మే నుండి అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. క్యూబాలో గడిచిన 24 గంటల్లో 80 కొత్త కరోనావైరస్ కేసులు వెలుగుచూడగా.. ఒకరు మరణించారు. 9,64,317 కేసులను 8,317కి తగ్గించింది. సోషలిస్ట్ దేశంతో పోలిస్తే.. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సి నేషన్ కార్యక్రమం వేగంగా సాగడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఒ) లెక్కల ప్రకారం..వ్యాక్సినేషన్ 33 కోట్ల జనభా ఉన్న అమెరికాలో ఇప్పటికి రెండు డోసులు 61.7శాతం మందికి మాత్రమే ఇచ్చారు. ఫ్రాన్స్‌లో 77.85 శాతం, కెనడాలో 82.9శాతం, బ్రిటన్‌లో 75.62 శాతంగా ఉంది. కాగా క్యూబాలో మాత్రం పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ 83 శాతం జరిగింది.