Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్‌పై చైనా పోరు
- వుహాన్ అనంతరం ఇదే అతిపెద్ద లాక్డౌన్
బీజింగ్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనాలోని పశ్చిమ నగరమైన సియాన్‌లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. రెండేళ్ల క్రితం వుహాన్‌లో మహమ్మారి ప్రారంభమైన అనం తరం విధించిన లాక్డౌన్ తర్వాత ఇదే అతిపెద్దదని ప్రభుత్వం పేర్కొంది. 130 లక్షల జనాభా కలిగిన సియాన్‌లో నివాసాల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది. ఆహారం, మందుల కోసం ఇంటి నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతించింది. అత్యవసరం కాని ప్రయాణాలపైనా నిషేధం విధించింది. ఇటీవల 14 జిల్లాల్లో పెద్దఎత్తున చేపట్టిన కరోనా పరీక్షల్లో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ నియంత్రణ తీవ్రమైనది, సంక్లిష్టమైనది అని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. కేసుల పెరుగుదల హాలిడే ట్రావెల్, వింటర్ ఒలింపిక్స్ నిర్వహణపై ప్రభావం చూపనుంది. వచ్చే ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సత్వర చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని సన్ చౌన్లాన్ కోరినట్లు జిన్హువా పేర్కొంది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు బయటపడగానే దాని అంతు తేల్చేందుకు సియాన్‌లో లాక్డౌన్ విధించింది. సియాన్ నుండి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా దేశీయ విమానాలను రద్దు చేసింది.