Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లామ్‌తో జిన్‌పింగ్ భేటీ
హాంగ్‌కాంగ్ : ఇటీవల జరిగిన హాంగ్‌కాంగ్ ఎన్నికలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం ఆమోద ముద్ర వేశారు. అలాగే ప్రస్తుతం హాంగ్‌కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వున్న కేరీ లామ్‌కు కూడా ఆమోద ముద్ర పడింది. హాంగ్‌కాంగ్ ఎన్నికల్లో కేవలం దేశభక్తులు, చైనా అనుకూల అభ్యర్ధులు మాత్రమే పాల్గొనాలని నిబంధనలను తీసుకువచ్చిన తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య అనుకూల ప్రతిపక్షాల అభ్యర్ధులు చాలామంది ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. 2019లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల లామ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఈ నేపథ్యంలో లామ్, బీజింగ్‌లో జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. గతేడాది జనవరిలో మయన్మార్‌లో పర్యటించిన తర్వాత జిన్‌పింగ్ దేశం విడిచి వెళ్ళలేదు. కాగా మార్చిలో ఎన్నికల కమిటీ హాంగ్‌కాంగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను ఎంపిక చేస్తుంది. అయితే మరోసారి లామ్ ఈ పదవిలో కొనసాగుతారా లేదా అన్నది తెలియరాలేదు. లామ్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు గురించి కేంద్ర అధికారులకు తెలుసుని, హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ (హెచ్కెఎస్ఎఆర్) ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విధులను నిర్వర్తించిందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. గతంలోని గందరగోళ పరిస్థితుల నుంచి ప్రస్తుతం సుస్థిరత నెలకొందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ అదుపునకు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు హాంగ్‌కాంగ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న సూత్రానికి అనుగుణంగా ఎన్నికల వ్యవస్థ మెరుగైందని ఆదివారం జరిగిన ఎన్నికలతో రుజువైందని, అలాగే హాంగ్‌కాంగ్ వాస్తవికతను కూడా ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు.
ఇదిలావుండగా, హాంగ్కాగ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య శక్తులు తుడిచిపెట్టుకుపోయాయంటూ జి 7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికను కొత్తగా తీసుకువచ్చిన మార్పులు తీవ్రంగా ప్రభావితం చేశాయని వ్యాఖ్యానించాయి. హాంగ్‌కాంగ్‌కు గల స్వయంప్రతిపత్తిని దెబ్బతీశాయని విమర్శించింది.