Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల జారీలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. హెచ్1బీ వీసాతో పాటు ఇతర వీసాలైన ఎల్-1, ఒ-1 అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ.. హెచ్-1బీ సహా పలు రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది.
నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసా హెచ్-1బితో పాటు, హెచ్-3, హెచ్-4, అంతర్గత కంపెనీ బదిలీలు (ఎల్ వీసాలు), అసాధారణ సామర్థ్యం కలిగిన వ్యక్తులకుజారీ చేసే ఒ వీసాలు, అథ్లెటిక్స్, కళాకారులు, తదితర రంగాలకు చెందిన వారికి జారీ చేసే పి వీసాలు, అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు (క్యూ వీసాలు) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వీసాలు జారీ చేసుందుకు దౌత్య కార్యాలయ అధికారులు ఆ అభ్యర్థులను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాల్సి వుంటుంది. స్థానిక పరిస్థితులను అనుసరించి ఎంబసీ, కాన్సులేట్లకు అవసరమైతే వ్యక్తిగత ఇంటర్వ్యూలు పెట్టే అధికారాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల, దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు తమ సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్సైట్లను పరిశీలిస్తుండాలని సూచించింది. కరోనా మహమ్మారి ఫలితంగా డిపార్ట్మెంట్ వీసా ప్రాసెసింగ్ విధానం తగ్గింది. అంతర్జాతీయంగా ప్రయాణాలు పునరుద్ధరిస్తున్నందున జాతీయ భద్రతను కొనసాగిస్తూ వీసాల కోసం వేచి చూసే సమయాన్ని తగ్గించడానికి ఈ చర్యలు చేపడుతోంది. ఒక వేళ వ్యక్తిగత ఇంటర్వ్యూలు తప్పనిసరని భావిస్తే.. స్థానిక పరిస్థితులను అనుసరించి కాన్సులేట్ అధికారులకు పూర్తి భాద్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపింది.
అందరి చూపు కెనడా వైపే..
భారతీయులు ఎక్కువగా కెనడా వైపు చూస్తున్నారు. యూకే,యూఎస్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా కెనడా సర్కార్ కల్పిస్తున్న వీసా సౌకర్యాలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్న తాత్కాలిక నివాసితులకు పర్మినెంట్ వీసా సౌకర్యం కల్పించబోతున్నది. 2021లో 401,000 మంది విదేశీయులకు శాశ్వత నివాసం మంజూరు చేయాలనే లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ తెలిపారు.