Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుతి రెబెల్స్్ దాడిలో మరో ఇద్దరు..
దుబాయ్ : యెమెన్‌పై శనివారం సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ముగ్గురు మరణించారు, ఆరుగురు గాయపడ్డారని యెమెన్ డాక్టర్లు తెలిపారు. రాజధాని సానాకు వాయవ్యంగా వున్న అజమా పట్టణంలో ఈ మరణాలు సంభవించాయి. 2014 నుండి యెమెన్ అంతర్యుద్ధంతో నలిగిపోతోంది. అప్పటి నుండి వేలాదిమంది మరణించారు. యెమెన్‌లో అత్యంత అధ్వాన్నమైన మానవతా సంక్షోభం నెలకొందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. తొలుత యెమెన్ సరిహద్దుల్లోని జజాన్ పట్టణంలోని ప్రధాన వీధిలో వాణిజ్య దుకాణంపై సైనిక క్షిపణి పడి ఇద్దరు మరణించారని రక్షణ వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో సౌదీ పౌరుడు, యెమెన్ నివాసి వున్నారని సౌదీ మీడియా తెలిపింది. గాయపడిన వారిలో ఆరుగురు సౌదీలు, ఒక బంగ్లాదేశీ కూడా వున్నారు. యెమెన్‌లోని హుతి రెబెల్స్ ఈ దాడికి పాల్పడ్డారు. క్షిపణి దాడిలో సమీపంలోని కార్లు, దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ వెనువెంటనే సౌదీ నేతృత్వంలోని సైనిక సంకీర్ణం స్పందిస్తూ, పెద్ద ఎత్తున సైనికచర్యకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అనంతరం వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు.