Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాటికన్ సిటీ : కుటుంబ కలహాల నుంచి ప్రపంచ యుద్ధాల వరకు అన్ని రకాల ఘర్షణల నివారణకు చర్చలే చక్కటి పరిష్కార మార్గమని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియా, యూరప్, ఆఫ్రికాల్లోని పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను, ఘర్షణలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం కన్నా పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రపంచ నేతలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. 'సామాజిక సంబంధాలు నెలకొల్పడానికి చాలా ప్రయత్నించాం. కానీ ఆ సంబంధాల నుండి బయటపడే ధోరణి పెరుగుతూ వస్తోంది. ఇతరులపై దాడికి ప్రయత్నించడానికి బదులుగా మనమంతా ఐక్యంగా కలసి పనిచేయాలని' అన్నారు. చర్చల మార్గాన్ని వీడి పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. దాంతో ఈ సంక్షోభం మరింత సంక్లిష్ట మవుతోందని అన్నారు. మనం అనేక ఘర్షణలను, సంక్షోభాలను, విభేదాలను చూస్తున్నాం. వీటికి ఎక్కడో ఒక చోట అంతం పలకాలని' అన్నారు. చర్చల పంథాలో పయనించే వారు మాత్రమే తమ ఘర్షణ లను, సమస్యలను పరిష్కరించుకోగలరని, శాశ్వత ప్రాతిపదికన ప్రయో జనాలు పొందగలరని అన్నారు. ఇటువంటి సంక్షో సమయాల్లో మనం దరం కలిసికట్టుగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.