Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 4500 విమాన సేవలు రద్దు
- వైరస్ బారిన ఉద్యోగులు
వాషింగ్టన్ : కరోనా రెండు దశల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విమానయాన రంగానికి తాజాగా ఒమిక్రాన్ పెను ముప్పులా మారింది. ఈ కొత్త వేరియంట్‌తో ప్రపంచ వ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు అవుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లాంటి అగ్ర దేశాలల్లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తుంది. వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకు వస్తున్నాయి. ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా 4,500 విమాన సర్వీసులు రద్దయ్యాయని విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ 'ప్లైట్ అవేర్ డాట్ కాం'' వెల్లడించింది. ఇందులో అమెరికా విమాన సర్వీసులు ఎక్కువగా రద్దు అయ్యాయి. దీంతో అనేక కుటుంబాల్లో క్రిస్మస్ పండగ ఆనందాలు హరించుకుపోయాయి. శుక్రవారం ఒక్క రోజునే కనీసం 2,366 విమానాలు రద్దు అయ్యాయి. దాదాపు 9వేల విమానాల రాకపోకల్లో ఆలస్యం జరిగింది. శనివారం మరో 1,779 విమానాలను నిలిచిపోయాయి. 402 విమానాలను ఆదివారానికి మార్చారు. ఒక వారంలోనే అమెరికాలో 25శాతం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారని 'ప్లైట్ అవేర్ డాట్ కాం'' వెల్లడించింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థలు శుక్రవారం 300 విమానాలను రద్దు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.51లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దాదాపు నెల రోజుల కిందట దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదయ్యింది. కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం నెల రోజుల్లోనే ఒమిక్రాన్ 108 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌తో ఇప్పటికే 26 మంది చనిపోయారు. విమానయాన రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఒమిక్రాన్ బారినపడుతున్నారు. దీంతో విమానయాన సంస్థల్లో ఉద్యోగుల కొరత మొదలయ్యింది. అమెరికాలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. గడిచిన వారంలో సగటున 45శాతం కేసులు పెరిగి 1.79లక్షలకు చేరాయి.