Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 మంది వలస కార్మికులు మృతి
ట్రిపోలి : లిబియా పశ్చిమ తీరంలో ఒక వలస కార్మికుల పడవ మునిగిపోవడంతో 28 మంది మృతి చెందారు. రాజధాని ట్రిపోలికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్న అల్-అలౌస్ బీచ్‌లో 28 మంది వలస కార్మికుల మృతదేహాలను గుర్తించడంతోపాటు, ముగ్గుర్ని ప్రాణాలతో రక్షించినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
మృతదేహాల స్థితిని బట్టి ప్రమాదం కొన్ని రోజుల క్రితమే జరిగి ఉండవచ్చునని, పడవలో ఎంత మంది ఉన్నారో తెలియకపోవడంతో మృతులు సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. లిబియాలో ఘర్షణల కారణంగా ఆ దేశానికి చెందిన పౌరులు చట్టవిరుద్ధంగా యూరప్‌కు వలస వెళ్లడానికి ప్రయత్నిస్తూ, ప్రమాదాలకు గురవుతుంటారు. వారం రోజల క్రితం ఇటువంటి ప్రమాదాల వల్ల 160 మంది మరణించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 1500 మంది మరణించారని వలస కార్మికులపై పని చేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ తెలిపింది.