Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం కంపెనీలను ఆదేశించిందని ఆ దేశ ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు. దేశంలో శనివారం ఒక్క రోజే లక్ష కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రధాని అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.కి రెండు మోతాదుల వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తులకు మాత్రమే రెస్టారెంట్లు, సినిమాహాళ్లలోకి ప్రవేశించే అర్హత లేదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరని, కచేరీలు, క్రీడల పోటీలు, ఇతర ఈవెంట్లలో 5వేల మందికి పరిమితి విధించారు. ప్రజలు బూస్టర్ డోసులు పొందాలని ప్రధాని కోరారు. కేసుల పెరుగుదలతో విద్యార్థులకు సెలవులను పొడిగించారు.