Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల్లోనే రెండోసారి
జెరూసలేం : సిరియా ఓడరేవు లటాకియాపై మంగళవారం ఇజ్రాయిల్ వైమానిక దాడి జరిపింది. ఈ నెల్లో కీలకమైన స్థావరంపై ఇటువంటి దాడి జరగడం ఇది రెండవసారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినప్పటి నుండి సిరియాపై వందలాది వైమానిక దాడులను ఇజ్రాయిల్ చేపట్టింది. ఈ దాడుల్లో ప్రభుత్వ స్థావరాలను, ఇరాన్ మద్దతు గల బలగాలను, హిజ్బుల్లా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున 3.21గంటలకు ఇజ్రాయిల్ పలు క్షిపణులతో లటాకియా ఓడరేవులోని కంటెయినర్ యార్డ్‌పై విరుచుకు పడిందని సైనిక వర్గాలను ఉటంకిస్తూ సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా తెలిపింది. ఈ దాడిలో గణనీయంగా ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీన ఇదే ఓడరేవులో ఇరాన్ ఆయుధాల షిప్‌మెంట్‌పై దాడులు నిర్వహించింది. కాగా ఈ దాడులపై ఇజ్రాయిల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నవంబరులో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ముగ్గురు సైనికులు, ఇద్దరు హిజ్బుల్లా కార్యకర్తలు మరణించారు.