Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహాన్నెస్‌బర్గ్ : ఈ నెల 26న మరణించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వర్ణ వివక్షపై పోరాడిన యోధుడు డెస్మండ్ టుటుకు ప్రత్యేకంగా కేటగిరీ వన్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించినట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫాసా తెలిపారు. నూతన సంవత్సరం రోజున కేప్‌టౌన్‌లో సెయింట్ జార్జి కేథడ్రల్‌లో ఉదయం 10గంటల సమయంలో అంత్యక్రియలు జరపనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నెలకొన్న పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలనుసరించి ఈ అంత్యక్రియలు జరుగుతాయని అధ్యక్షుని అధికార ట్విట్టర్ పేజ్ తెలిపింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలంటే పూర్తి స్థాయి సైనిక గౌరవ వందనంతో నిర్వహిస్తారు. సాధారణంగా దేశాధ్యక్షులకి, ఇతర ప్రముఖులకు ఈ గౌరవం దక్కుతుంది. కేటగిరీ వన్ అంత్యక్రియల్లో ప్రభుత్వ భవనాలన్నింటిపై నల్లని వస్త్రం కప్పుతారు. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాఫ్రికా దౌత్య కార్యాలయాల్లో జాతీయ పతాకాలను సగం అవనతం చేస్తారు. 21 తుపాకులను గాల్లోకి పేలుస్తారు. సైనికులు గౌరవ వందనం నిర్వహిస్తారు. బ్రాస్ బ్యాండ్ వుంటుంది.