Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోర్డాన్ పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు
అమ్మాన్ : ప్రజలకు ఆదర్శంగా వుండాల్సిన పార్లమెంట్ సభ్యులే పరస్పరం దాడులు చేసుకున్నారు. చట్టసభల హుందాతనాన్ని దిగజార్చారు. మంగళవారం జోర్డాన్ పార్లమెంట్ ఇందుకు వేదికైంది. రాజ్యాంగానికి చేయతలపెట్టిన ప్రతిపాదిత సవరణలపై చర్చ జరుగుతుండగా ఈ పరిస్థితి ఎదురైంది. ఒక డిప్యూటీని సభ నుండి వెళ్ళిపోవాల్సిందిగా స్పీకర్ కోరడంతో తలెత్తిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పలువురు ఎంపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒక దశలో చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వ్యవహారమంతా మీడియాలో ప్రత్యక్ష ప్రసారమైంది. ఇలా కొట్టుకుంటున్నపుడు ఒక ఎంపి కిందపడిపోవడం కూడా కనిపించింది. మరికొంతమంది అరవడం వినిపించింది. కొన్ని నిమిషాల పాటు ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఎంపి అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించడంతో అసహ నానికి గురైన స్పీకర్ సభ నుండి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారని, దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం నెలకొందని, అనంతరం దాడికి దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులుతెలిపారు. అయితే ఈఘర్షణలో ఎవరికీ గాయాలు కాలేదు. పార్లమెంటు లో సభ్యులు వ్యవహరించిన తీరు ఆయోద యోగ్యం కాదని, మన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పార్లమెంట్ సభ్యుడు ఖలీల్ అతియే ఆగ్రహం వ్యక్తం చేశారు.