Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూడాన్‌లో ఘోరం
కార్టూమ్ : ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో ఒక బంగారు గనికూలి పోయిన దుర్ఘటనలో 38 మంది మతిచెందారు. మరో 10మంది వరకూ గాయ పడ్డారు. వీరంతా సాధారణ ప్రజలుగానే భావిస్తు న్నారు. సూడాన్ రాజధాని కార్టూమ్కి 500 కిలో మీటర్ల దూరంలోని, పశ్చిమ ఖోర్డోఫన్ రాష్ట్రానికి చెందిన ఇల్ నుహుద్ పట్టణానికి సమీపంలో ఉన్న గనిలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సుడనేసే మైనరల్ రీసోర్సెస్ కంపెనీకి చెందిన ఉమ్ డ్రాయిసయ మైన్‌లో ఈ ఘోరం జరిగింది. అయితే ఈ గని మైనింగ్‌కు అనుకూలంగా లేదని, మూసివేయా ల్సిందిగా ప్రభుత్వ భద్రతా కమిటీ గతంలోనే హెచ్చరించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే బంగారం కోసం స్థానిక ప్రజలు తరుచుగా ఈ గనిలోకి వెళుతుంటారు.
ఈ గని ఎలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయలేదు. సుడాన్లో సాంప్రదాయకంగా బంగారం వెలికితీసే పనులను సుడనేసే మైనరల్ కంపెనీ నిర్వహిస్తుంటుంది. ఈ కంపెనీలో సుమారు 20 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తుంటారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితీసే దేశాల్లో సూడాన్ వాటా 75 శాతంగా ఉంది. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.