Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : ఫిలిఫీన్స్లో రారు తుపాన్ మృతుల సంఖ్య శుక్రవారానికి 400 దాటింది. రారు తుఫాన్ సంభవించిన రెండువారాల తరువాత కూడా అధికంగా దెబ్బతిన్న రాష్ట్రాలకు ఆహారం, మంచినీరు, పునరావస వస్తువులు మరింత పంపిణీ కోసం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2021 ఏడాదిలో రారు తుపాన్ దేశంలో 15వ తుపాన్, అలాగే అతి భయంకరమైన తుపాన్. ఈ తుపాన్‌తో ఇప్పటి వరకూ 405 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది నీటిలో మునిగిపోవడం, చెట్లు-కొండచరియలు పడ్డంతో మరణించారని జాతీయ విపత్తు ఏజెన్సీ చీఫ్ రికార్డో జలద్ తెలిపారు. అలాగే 82 మంది గల్లంతయ్యారని, 1,147 మంది గాయపడ్డారని తెలిపారు. 5,30,000 ఇళ్లు నాశనమయ్యాయని, ఇందులో మూడో వంతు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగాల్లో 459 మిలియన్ డాలర్లు నష్టం జరిగిందని అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబరు 16న తీరం తాకిన ఈ తుపాను సుమారు 50 లక్షల మందిపై ప్రభావం చూపిందని చెప్పారు. న