Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారాన్ని అణచివేస్తుందని జర్నలిస్టుల ఆరోపణ
జెరూసలేం : పాలస్తీనాపై ఫేస్బుక్ పక్షపాతానికి పాల్పడుతుందని, అనుకూల సమాచారాన్ని అణచివేస్తుందని ఆ దేశ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పాలస్తీనీయుడ్ని ఇజ్రాయిల్ సైనిక దళాలు కాల్చిచంపుతున్న ఒక వీడియోను డిసెంబరు 4న పాలస్తీనా టీవీ కరస్పాండెంట్ క్రిస్టినే రినావి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది సేపటికే సమారు 4 లక్షల ఫాలోవర్లు ఉన్న రినావి ఖాతా నుంచి సదరు వీడియోను ఫేస్బుక్ తొలగించింది. ఇలాంటి చేదు అనుభవం రినావికి ఇదే మొదటిసారి కాదు. నవంబర్లో నెలలో కూడా జెరూసలేంలో జరిగిన దాడి వీడియోను ఆమె ఖాతా నుంచి ఫేస్బుక్ తొలగించింది. రినావి పోస్టు చేసిన వీడియోలనే కాదు, పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న సమచారాన్ని ఫేస్బుక్ తొలగిస్తుందని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. తాము పోస్టు చేస్తున్న సమాచారాన్ని ఫేస్బుక్ సెన్సార్ చేస్తుందని విమర్శించారు.పాలస్తీనా సోషల్ మీడియా మోనటరింగ్ కేంద్రం సదా సోషల్ నివేదిక ప్రకారం 2021లో 600 పాలస్తీనా ఖాతాలు లేదా పాలస్తీనా అనుకూల పోస్టులను ఫేస్బుక్ తొలగించింది.