Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మదురో హామీ
- పదేళ్ళలో 39లక్షల గృహాలను నిర్మించిన ప్రభుత్వం
కారకస్ : గత పదేళ్ళలో 39లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయడం పట్ల వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో సంతృప్తి వ్యక్తం చేశారు. ముప్పై తొమ్మిదో లక్ష గృహం పూర్తయిన వెంటనే శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణమనేదాన్ని ఒక సరుకుగా చూడకుండా దాన్ని ఒక మానవ హక్కుగా మార్చగలిశామని చెప్పారు. అప్పటి అధ్యక్షుడు హ్యుగో చావెజ్ నేతృత్వంలో 2011లో మహత్తర గృహ నిర్మాణ కార్యక్రమం ఆరంభమైంది. 2025 నాటికి 50లక్షల గృహాలను నిర్మిస్తామని వెనిజులా ప్రభుత్వం ప్రతిన బూనింది. కానీ నిర్దిష్ట కాలపరిమితిలో ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని మదురో తెలిపారు. తొలుత భారీ వర్షాలు, వరద బాధితులకు సహాయంగా వుండేందుకు ప్రారంభించిన ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు తర్వాత కాలంలో దేశ జనాభా అందరికీ విస్తరించారు. ఈ చొరవ వల్ల కోటీ 20లక్షల ందికి పైగా లబ్ది పొందుతారని భావిస్తున్నారు.