Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు అణువిద్యుత్ కేంద్రాల మూసివేత
బెర్లిన్ : జర్మనీలో అణు విద్యుత్‌ను తొలగించే క్రమం మొదలైంది. ఇప్పటి వరకు పనిచేస్తున్న ఆరు అణువిద్యుత్ కేంద్రాల్లో మూడింటిని మూసివేసింది. దీంతో 11ఏళ్ళ ప్రణాళిక అమలుకు అడుగుపడింది. జర్మనీ ఇంధన పరివర్తనా విధానం కింద 2021 డిసెంబరు 31నుండి మూడు అణు విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. వీటిలో గండ్రెమింగెన్ ప్లాంట్ ఇప్పటికీ ఏడాదికి 10 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌లో కొన్ని భాగాలను ఇప్పటికే మూసివేశారు. మొత్తంగా మ్యునిక్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి విద్యుత్‌ను అందించగల సామర్ధ్యం దీని స్వంతం. శనివారం అర్ధరాత్రి నుండి బ్రొకొడార్ఫ్ ప్లాంట్ మూతపడుతోంది. ఈ ప్లాంట్‌ను 35ఏళ్ళుగా నిర్వహిస్తూ వచ్చామని, ఇంతవరకు సురక్షితంగా, సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుంచామని కంపెనీ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గైడో నాట్ వ్యాఖ్యానించారు. 2022 చివరి నాటికి పూర్తిగా అణు విద్యుత్‌ను నిలిపివేయాలన్నది జర్మనీ లక్ష్యంగా వుంది. ఫుకుషిమా అణు విపత్తు నేపథ్యంలో 2011 మే 30న చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.