Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో శాస్త్రీయత లోపించిన కరోనా కట్టడి చర్యలు
- డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్
జెనీవా : కరోనా వ్యాప్తి కట్టడి కోసం భారత్ అమలుజేస్తున్న నైట్ కర్ఫ్యూలు, ఇతర చర్యల్లో శాస్త్రీయత లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ విమర్శించారు. భారత్‌లో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉందని, ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ కేవలం ప్రారంభం మాత్రమేనని ఆమె హెచ్చరించారు. కాబట్టి భారతీయుల జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటం, విందు, వినోద కార్యక్రమాలు ఒమిక్రాన్ వ్యాప్తిని భారీగా పెంచుతుందని తెలిపారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్ నుంచి వచ్చిన ఒమిక్రాన్ గణాంకాల్ని విశ్లేషించాక..కొత్త వేరియెంట్ అత్యంత ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గుర్తించామని చెప్పారు. ''ఒమిక్రాన్ సోకాక చాలామందిలో లక్షణాలు కనిపంచటం లేదు. అయినా రోగులు వైద్యుల సలహాలు తీసుకోవాలి. హెల్త్ వర్కర్ల సేవలు అవసరం అవుతాయి'' అని ఆమె అన్నారు. ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు టెలీవైద్య సేవలు ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు సూచించారు. ఒమిక్రాన్ కేసుల్లో ఐసీయూ, హాస్పిటల్లో చేరటం తక్కువగా ఉందని, అవుట్ పేషెంట్, ఇంటివద్ద చికిత్స పొందే బాధితులు పెరిగే అవకాశముందని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల్లో మరణాల శాతం తక్కువగా ఉందని, రిస్క్ పెద్దగా లేదని తేలిగ్గా తీసుకోవదన్నారు. ఒక్కసారిగా కేసుల నమోదుతో హాస్పిటల్స్‌లో రోగుల చేరిక, వైద్య సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.