Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం : ఇజ్రాయెల్లో కరోనాకు సంబంధించిన మరో కొత్త రకం కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలో కోవిడ్-19.. ఇన్ఫ్లుఎంజా డబుల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధికి 'ఫ్లోరోనా' అని పేరు పెట్టారు. దీంతో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కొత్త కేసుపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఫ్లోరోనా వైరస్.. డెల్టా లేదా ఒమిక్రాన్ వంటి కొత్త కరోనా జాతి వంటిది కాదు. ఫ్లోరోనాతో బాధపడుతున్న రోగిపై కరోనా వైరస్.. ఇన్ఫ్లుఎంజా వైరస్ రెండూ ఏకకాలంలో దాడి చేస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. అంటువ్యాధి ప్రారంభమైన తర్వాత ఫ్లోరోనా కేసు నమోదవడం ఇదే మొదటిసారి. ఫ్లోరోనాతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో అనేక లక్షణాలను ఏకకాలంలో చూడవచ్చు. ఇందులో న్యుమోనియా, మయోకార్డిటిస్ .. ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సమస్యలు ప్రాణాంతకంగా మారవచ్చు. కైరో యూనివర్శిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నహ్లా అబ్దేల్ వహాబి మాట్లాడుతూ, ఫ్లోరోనా ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా సోకుతుందని చెప్పారు. దీనికి కారణం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తి. రెండు తీవ్రమైన వైరస్లు ఒకేసారి దాడి చేయడం సాధారణం కానందున, బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ప్రజల గుండె కండరాలు వాపుకు గురవుతాయి. ఫ్లోరోనా వల్ల మనకు ఇంకా ఎలాంటి హాని జరుగుతుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.