Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పిలుపు
లండన్ : ఇష్టం వచ్చినట్లు ఉద్యోగుల తొలగింపు, పొదుపు చర్యలు, జాత్యహంకారం, సైనికతత్వంతో సహా స్వదేశంలోనూ, విదేశాల్లోనూ బ్రిటీష్ అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా 2022ను పోరాట సంవత్సరంగా చేయాలని కార్మిక ఉద్యమానికి బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రాబ్ గ్రిఫ్ఫిథ్స్ పిలుపునిచ్చారు. 'ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న లక్షలాది మందికి 2021లోనూ ఉపశమనం కలగలేదని' పేర్కొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షల్లో గ్రిఫ్ఫిథ్స్ ఈ విషయాన్ని తెలిపారు. 'ప్రపంచవ్యాప్తంగా 5.5 మిలియన్లు, బ్రిటన్లో 1,48,000కు చేరి కరోనా మరణాలు రెట్టింపయ్యాయి' అని చెప్పారు. 'పేదరికం, వ్యాధులు, యుద్ధం నుండి పారిపోతున్న ప్రజలు ఇంగ్లీష్ ఛానల్, మధ్యధరా సముద్రంలో మునిగిపోతూనే ఉన్నారు లేదా కలైస్ నుండి ఉక్రెయిన్ వరకూ పునరావాస శిబిరాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు' 'అయినప్పటికీ, ఎప్పటిలాగే.. ప్రపంచంలోని అత్యంత సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పోషకాహార లోపం, గ్లోబల్ వార్మింగ్ వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తమ సంపద, శక్తిని ఉపయోగించేందుకు నిరాకరిస్తాయి' అని తెలిపారు.