Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగొటా : కొలంబియాలోని అరకా ప్రావిన్స్‌లో జరిగిన సాయుధ ఘర్షణల్లో 23మంది మరణించారని రక్షణమంత్రి డిగో మొలానో తెలిపారు. వెనిజులా సరిహద్దుల్లో వున్న అరకా ప్రావిన్స్‌లో గత వారాంతంలో అక్రమ సాయుధ గ్రూపుల మధ్య పోరు చెలరేగింది. నేషనల్ లిబరేషన్ ఆర్మీ (ఇఎల్ఎన్), 2016 నాటి శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న, అసమ్మతివాదులైన రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఫార్క్) సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నియంత్రణ కోసం ఈ గ్రూపులు పోరాడుతున్నాయని కొలంబియా ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ హింసాకాండతో 12 కుటుంబాలు నిర్వాసితులయ్యాయని కొలంబియా మానవ హక్కుల నేత తెలిపారు. 2వేల సంవత్సరం నుండి ఈ హింసాకాండ కొనసాగుతునే వుంది. 2010లో పోరు నిలిచేసమయానికి 58వేలమందికి పైగా నిర్వాసితులు కాగా, 868మంది మరణించారని మానవ హక్కుల గ్రూపు ఒక నివేదికలో తెలిపింది. సైన్యానికి, సాయుధ గ్రూపులకు ఘర్షణలు చెలరేగడంతో గతేడాది మార్చిలో దాదాపు 5వేలమంది పొరుగునే వెనిజులాలో గల అపురే ప్రాంతానికి పారిపోయారు. తాజాగా జరిగిన ఘర్షణల్లో 24మంది మరణించారని మానవ హక్కుల గ్రూపు సీనియర్ దర్యాప్తు అధికారి జువాన్ పాపియర్ ట్విట్టర్లో తెలిపారు. కాగా, అరకాలో పరిస్థితిని అంచనా వేసేందుకు సైనిక, పోలీసు అధికారులతో అధ్యక్షుడు ఇవాన్ దుక్యూ అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.