Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్ట్ అవు ప్రిన్స్ : ఈ వారంతంలో జరిగిన హత్యాయత్నం నుంచి హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ ప్రాణాలతో బయడపడ్డారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 1న 218వ కరేబియన్ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక చర్చ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానిని కాల్చిచంపడానికి తీవ్రవాదులు ప్రయత్నించారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాని, అతని పరివారంపై సాయుధులు కాల్పులు జరుపుతుండటంతో వారు తమ వాహనాలపైపు పారిపోతుండటం వీడియోల్లో కనిపిస్తుంది. ఈ కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. హెన్రీ కాన్వరుపై కాల్పుల జరిపిన అనుమానితుల కోసం అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, జులైలో హైతీ అధ్యక్షులు జోవెనెల్ మోస్సీ కిరాయి గూండాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానిపై హత్యాయత్నం జరగడం ఆందోళనలు రేకేతిస్తుంది. మోస్సీ హత్య జరిగిన కేవలం రెండు వారాల తరువాత ప్రధానిగా హెన్రీ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, హైతీలో ఇప్పటి వరకూ తదుపరి అధ్యక్షున్ని ఎన్నుకోలేదు.