Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిండి కోసం అలమటిస్తున్న 22లక్షల మంది
కాందహార్ : గత 20 ఏండ్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ అమెరికా సైన్యం ఆధీనంలో ఉన్నది. యుద్ధం కారణంగా అమెరికా విధించిన ఆంక్షలతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధికంగా చితికిపోయింది. ఇతర దేశాల నుంచి సరుకుల రవాణా సైతం నిలిచిపో యింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నిధులను స్తంభింపజేయడంతో ఆఫ్ఘనిస్థాన్లో డబ్బుల కొరత ఏర్పడింది. దీంతో 22 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇతర దేశాలు కూడా సరుకులు పంపడానికి సాహసించడం లేదు.ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ80శాతం విదేశీ ఆర్థిక సహాయం పైనే ఆధారపడి ఉండేది.యుద్ధం ఆగిపోవడంతో ఆర్థిక సహా యం నిలిచిపోయింది. రెండోవైపు,ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆగిపోయింది. పరిశ్రమలు నడవకపోవడం వంటి సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక,మానవ సంక్షోభం కోరలలో చిక్కుకున్నది. దీంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.