Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తున్నది. ఇక్కడ ఒక్కరోజులేనే పది లక్షల కేసులు నమోదుకావడం ప్రమాద తీవ్రతకు అద్దంపడుతున్నది. గత వారంలో రోజుకు సగటున 4.18 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నప్పటికీ యూఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటాన్ని అక్కడి వైద్యులు తప్పుబడుతున్నారు. అమెరికాలో కేసులు భారీగా పెరుగుతుండటంతో అక్కడి కార్మికులు పనులకు రావడానికి జంకుతున్నారు. ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలను కాపాడాలని వైద్య నిపుణులు సూచించారు. ఇటు, బ్రిటన్లోనూ ఇవే పరిస్థితుతుల నెలకొన్నాయి. కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో, వైద్యులు, ఆరోగ్య నిపుణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.