Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుని ప్రతిపాదనకు ప్యుబెలా గ్రూపు మద్దతు
మెక్సికో సిటీ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెకు మెక్సికోలో ఆశ్రయం ఇవ్వాలని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడర్ (ఎఎంఎల్ఓ) చేసిన ప్రతిపాదనకు ప్యుబెలా గ్రూప్ మద్దతిచ్చింది. అమెరికా అధికారుల రాజకీయ వేధింపులను ఎదుర్కొంటున్న అసాంజెకు రాజకీయంగా ఆశ్రయం కల్పించాలన్న మెక్సికో ప్రభుత్వ చొరవను ఈ గ్రూపు ప్రశంసించింది. లాటిన్ అమెరికాకు చెందిన ప్రగతిశీల నేతల సంస్థ అయిన ప్యుబెలా గ్రూపు తన సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సందేశాన్ని ప్రచారం చేసింది. అసాంజె పట్ల అమెరికా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఒబ్రాడర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అసాంజె అస్వస్థతతో బాధపడుతున్నారని, మెక్సికోతో సహా ఏ దేశంలో ఆయన జీవించాలనుకుంటున్నారో ఆ దేశంలో ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు అనుమతించడం సౌహార్ద్రతకు, సంఘీభావానికి సూచన అని ఒబ్రాడర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లండన్లోని బెల్మార్ష్ జైల్లో వున్న అసాంజె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తనను అమెరికాకు అప్పగించడాన్ని ఆపాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై బ్రిటన్ సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.