Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. సర్వేలో వెల్లడి
వాషింగ్టన్ : సాధారణంగా కొత్త సంవత్సరం అంతా బాగుంటుందని అందరూ ఆశిస్తారు. కానీ గడిచిన అనుభవాల దృష్ట్యా కొత్త సంవత్సరంలో తమ దేశం, మొత్తంగా ప్రపంచం ఎలా వుంటుందోనని మెజారీటీ అమెరికన్లు భయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. గతేడాది చివరిలో యాక్సిస్-మొమెంటివ్ నిర్వహించిన పోల్లో 51శాతం మంది ప్రజలు కొత్త సంవత్సరంలో ఎలా వుంటుందోనన్న భయాందోళనలతోనే వున్నట్లు చెప్పారు. మొత్తంగా ప్రపంచ పరిస్థితుల గురించి 54శాతం మంది ప్రజలు కలవరపడుతున్నారు. ప్రత్యేకంగా తమ దేశానికి కొత్త సంవత్సరంలో కలిసి వచ్చే అవకాశాలపై వారు ఆశాభావంతో లేరు. ఆశల కన్నా భయాలే ఎక్కువగా వున్నాయని ప్రతి పది మందిలో ముగ్గురు చెప్పారు. 2020లో ఇలా చెప్పిన వారు 25శాతం వుండగా, 2018లో 22శాతంగా వున్నారు. డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్లు ఎక్కువ ఆశాభావంతో వున్న ప్పటికీ రెండు గ్రూపులు ఎక్కువగా ప్రతికూలం గానే ఆలోచిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటి దృష్ట్యా కొత్త సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సమస్యలు తప్పవని అంటున్నారు.