Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయం పేరుతో పశ్చిమ దేశాల నుంచి ఆఫ్రికాకు దేశాలకు
- చివరకు చెత్తకుప్పల పాలవుతున్న తీరు
ఆఫ్రికా : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆఫ్రికా దేశాలు వ్యాక్సిన్ ల కోసం ఆతతగా ఎదురుచూస్తున్నాయి. అయితే, పశ్చిమ దేశాల నుంచి సాయం పేరుతో వచ్చిన వ్యాక్సిన్లు మాత్రం కాలం చెల్లిపోయి చెత్తకుప్పల్లో పడేస్తున్న దృశ్యా లు ఇక్కడ కనిపిస్తున్నాయి.నైజీరియాకు పశ్చిమ దేశాల నుంచి దాదాపు 30లక్షలు అష్ట జనక వ్యాక్సిన్లు అందా యి. ఈ వ్యాక్సిన్ను తమ అవసరాల కంటే పశ్చిమ దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నవి. వాటిని తమ గోదాములలో దాచిపెట్టుకుని కాలం చెల్లిపోతున్న సమయంలో ఏదో ప్రజలపై ప్రేమతో ఇస్తున్నట్టు నాటకమాడి ఆఫ్రికా లోని పేద దేశాలకు సహాయం పేరుతో పంపుతున్నాయి.కాలం చెల్లిపోతున్నట్టు తెలిసినా స్పందించకుండా ఇప్పుడిచ్చి వాటిని ప్రజలకు అందించే సమయం లేకపోవడంతో చెత్తకుప్పలో వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.అవే వ్యాక్సిన్లు సమ యానికి అందితే ప్రజలకు ఉపయోగపడేవి. వ్యాక్సిన్ల రూపంలో వివక్షత కారణంగా ఈ నాటకం జరుగు తున్నదనే ఆరోపణలున్నాయి.ఉదాహరణకు నైజీరియా దేశానికి 30 లక్షల వ్యాక్సిన్లు ఇస్తే అందులో 10.60 లక్షల వ్యాక్సిన్ల కాలం చెల్లిపోయింది. సేనిగలు దేశానికి పంపిన నాలుగు లక్షల వ్యాక్సిన్లు వృథా అయ్యాయి.