Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : రెండో హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా గురువారం ప్రకటించింది. కరోనా సంబంధిత ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ సైనిక బలగాలను ఆధునీకరిస్తామని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రతిన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రయోగం నిర్వహించారు. గత రెండు మాసాల్లో బహిరంగంగా జరిగిన మొదటి ఆయుధ పరీక్ష ఇదే. బుధవారం జరిగిన ఈ ప్రయోగ ఫలితాల పట్ల పాలక వర్కర్స్ పార్టీ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు అధికార కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) తెలిపింది. ధ్వని వేగం కన్నా ఐదు రెట్లు వేగంతో హైపర్సోనిక్ ఆయుధాలు ప్రయాణిస్తాయి. ఇటువంటి అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన క్షిపణులను ఉత్తర కొరియా ఏ విధంగా తయారుచేయగలిగిందో స్పష్టంగా తెలియరాలేదు. గత సెప్టెంబరులో మొదటి హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించారు. హైపర్సోనిక్ క్షిపణి రంగంలో వరుసగా విజయాలు సాధించడం వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకుందని కెసిఎన్ఎ తెలిపింది. ఇక్కడ వ్యూహాత్మకత అంటే అణ్వాయుధాలను తీసుకెళ్లగల సామర్ధ్యం దీని సొంతం.