Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్‌టౌన్ : నల్లజాతి ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన నెల్సన్ మండేలాను నిర్బంధించిన జైలు గది తాళం చేయి వేలం నిలిపివేయాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తమ హక్కుల కోసం పోరాటం చేసిన మండేలాను అప్పట్లో 27 ఏండ్లు జైలులో నిర్బంధించారు. ఇందులో రోబిన్ ఐలాండ్ జైలులో ఆయన 18 సంవత్సరాల పాటు గడిపారు. దానితో ఆ జైలు గది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆ గది తాళం చేయిని వేలం వేసి వచ్చే డబ్బుతో ఒక మ్యూజియం కట్టాలని ప్రయత్నం జరిగింది. నల్లజాతి ప్రజల ఆకాంక్షలకు ఆ జైలు గది ప్రతీకగా నిలిచింది. నిర్బంధము యొక్క బాధకు, హక్కుల సాధనకు ఆ గది నేపథ్యంగా ఉన్నది. ఆ గది ఒక వీరోచిత వారసత్వానికి ప్రతీకని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆ తాళం చేయిని వేలం వేయరాదనీ, దాన్ని వారసత్వ సంపదగా గుర్తించి భద్రపరచాలని నిర్ణయం తీసుకున్నది.