Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్-టోక్యో : అమెరికా, జపాన్ల మధ్య కొత్తగా ఒక సైనిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం జపాన్ లో మరో 50 వేల అమెరికా సైన్యం తిష్ట వేయనున్నది. దానికి అయ్యే ఖర్చును భరించడానికి జపాన్ అంగీకరించింది. చైనా, రష్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ సైనిక సహకారం ఏర్పడింది. ఈ ఒప్పందం యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఒప్పందం చివరిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్ని పరిస్థితులు, ఉత్తర కొరియా ప్రయోగించిన మిసైల్ వంటి అంశాలను గమనిస్తే ఈ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థమవుతున్నదని చెప్పుకొచ్చారు. దానికి విరుగుడుగా తమ ఒప్పందం ఉంటుందని సమర్థించుకున్నారు.