Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనాగ్వా : వామపక్షవాది ఒర్టేగా నికరాగ్వాకు ఐదోవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది వరుసగా ఆయన నాలుగోసారి అధ్యక్ష పదవి స్వీకరించడం. దక్షిణ అమెరికా దేశమైన నికరాగ్వాలో నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల మద్దతుతో ఆయన అధ్యక్షుడు కావడం ఇది ఐదవసారి. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్యూబా, వెనెజులా, హోండురస్ అధ్యక్షులు, చైనా నుండి ప్రతినిధులు హాజరయ్యారు. లాటిన్ అమెరికా దేశాల్లో వరుసగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలలో వామపక్షవాదులు గెలుపొందటం జరుగుతున్నది.