Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో అరుదైన సర్జరీ
న్యూయార్క్: మనిషికి కృత్రిమ గుండెను అమర్చి నట్టువిన్నాం.. కానీ మనిషికి జంతువు గుండెను అమర్చా రంటే నమ్ముతారా.. అది కూడా పందిగుండెను అమ ర్చారు. అమెరికాకు చెందిన వైద్యబృందం మొట్టమొదటిసారిగా జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ఓ వ్యక్తికి విజయవం తంగా అమర్చింది. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన యూని వర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ తాజాగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక్కడి మేరీల్యాం డ్కు చెందిన డేవిడ్ బెన్నెట్(57) హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సాంప్రదాయ హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్, కృత్రిమ పంపింగ్‌కు ఆయన శరీరం సహ కరించకపోవడంతో.. వైద్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మానవ శరీరంలో పొసగేలా జన్యు సవ రణలు చేసిన ఓ పంది గుండెను సేకరించారు. ఆయ నకు విజయవంతంగా అమర్చారు. శస్త్రచికిత్స జరిగి మూడు రోజులు కాగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటు న్నారు. మరోవైపు వైద్యులు నిరంతరం పర్యవేక్షి స్తున్నారు. అంతకుముందు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మి నిస్ట్రే షన్.. ఈఆపరేషన్ కోసం అత్యవసర అనుమతు లను మంజూరు చేసింది. 'చనిపోవడమో లేదా ఈ శస్త్రచికిత్స చేయించుకోవడమో.. నా ముందు ఈ రెండే అవకాశాలు ఉన్నాయి. అయితే, నేను బతకాలనుకున్నా. అందుకే అంగీకారం తెలిపా' అని సదరు రోగి శస్త్రచికిత్సకు ముందు చెప్పారు. అవయవాల కొరతను పరిష్కరించే దిశగా ఇదొక ముందడుగని ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించిన బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌లోనూ న్యూయార్క్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన విషయం తెలిసిందే.