Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : 27మంది ఖైదీల ఊచకోతకు కారణమైనందుకు శ్రీలంక జైళ్ళ చీఫ్‌కు కొలంబో హైకోర్టు మరణ శిక్ష విధించింది. 2012 నవంబరులో జరిగిన ఈ ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హత్యలకు జైళ్ల కమిషనర్ ఇమిల్ లామాహెవెగ్ బాధ్యుడని బుధవారం కొలంబో హైకోర్టు పేర్కొంది. సహ నిందితుడు, పోలీస్ కమాండో మోజెస్ రంగజీవాను నిర్దోషిగా పేర్కొంది. కొలంబోలోని ప్రధాన వెలికడ జైల్లో జరిగిన ఈ హత్యలకు సంబంధించి 2019 జులైలో ఈ ఇద్దరిపై అభియోగాలు మోపారు. మొత్తంగా 27మందిని కాల్చి చంపినా కానీ కేవలం 8మందికి సంబంధించే సాక్ష్యాధారాలు సేకరించారు. జైల్లో తలెత్తిన ఘర్షణలను అదుపు చేయడానికి పోలీసు కమాండోలు రంగంలోకి దిగి, ఖైదీల నుండి ఆయుధాలు లాక్కున్నారని, ఆ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఈ హత్యలు జరిగినట్లు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, పేరుపెట్టి 8మంది ఖైదీలను పిలిచి వారిని ఉరి తీసి చంపారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ తెలిపారు.